Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్

Continues below advertisement

ఒకే టీ20 వరల్డ్ కప్ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సాహిబ్‌జాదా ఫర్హాన్ సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టి పాక్ ఓపెనర్ ఈ ఘనత సాధించాడు. సూపర్ 8లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచులో 38 పరుగులు పూర్తి చేయగానే ఫర్హాన్, విరాట్ రికార్డును బద్దలు కొట్టాడు. ఫర్హాన్ ఇప్పటివరకు ఇదే వరల్డ్ కప్‌లో 3 హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీ చేయగా.. ఈ మ్యాచ్ లోనూ సెంచరీ సాధించాడు. దాంతో ఓ టీ20 వరల్డ్ కప్ లో రెండు సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్‌గా నిలిచాడు.

ఒకే టీ20 వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ పేరిట ఉండేది. విరాట్ 2014 వరల్డ్ కప్‌లో 319 పరుగులు చేశాడు. శ్రీలంకతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌కు ముందు వరకు సాహిబ్‌జాదా ఫర్హాన్ 283 పరుగులతో ఉన్నాడు. శ్రీలంకపై జరిగిన మ్యాచ్‌లో అర్థ సెంచరీ చేసే క్రమంలో పాక్ ఓపెనర్ ఈ రికార్డును నెలకొల్పాడు. 

విరాట్ కోహ్లీ 2014 టీ20 వరల్డ్ కప్‌లో 6 ఇన్నింగ్స్‌ల్లో 106.33 సగటుతో 319 పరుగులు సాధించాడు. ఆ టీ20 వరల్డ్ కప్‌లో విరాట్ బ్యాటింగ్ లో రాణించి 4 అర్థ సెంచరీలు చేశాడు. ఇది కాకుండా విరాట్ కోహ్లీ 2022 వరల్డ్ కప్‌లో కూడా 296 పరుగులు చేశాడు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇప్పటికీ విరాట్ కోహ్లీ పేరిటనే ఉంది. విరాట్ తన వరల్డ్ కప్ కెరీర్‌లో 33 ఇన్నింగ్స్‌ల్లో 1,292 పరుగులు చేశాడు. ఈ జాబితాలో రెండో స్థానంలో కూడా భారత్‌కు చెందిన రోహిత్ శర్మ ఉన్నాడు. తన టీ20 వరల్డ్ కప్ కెరీర్‌లో హిట్ మ్యాన్ 1,220 పరుగులు చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola