Sachin Tendulkar Emotional Post For Arjun | కొడుకు ప్రదర్శనపై సచిన్ ఎమోషనల్ పోస్ట్ వైరల్
ఐపీఎల్ 2026 లీగ్ స్టేజ్ చివరి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఓడిపోయినప్పటికీ.. అందరి దృష్టి మాత్రం ఒక్కరిపైనే నిలిచింది. అతడే గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్. ముంబై ఇండియన్స్ నుండి లక్నోకు మారిన తర్వాత ఈ సీజన్ మొత్తం బెంచ్‌కే పరిమితమైన అర్జున్.. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో ఎట్టకేలకు తుది జట్టులో అవకాశం దక్కించుకున్నాడు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే తన బౌలింగ్ తో అందరి ప్రశంసలు అందుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో అర్జున్ టెండూల్కర్ 4 ఓవర్లలో కేవలం 9 ఎకానమీతో 36 పరుగులు ఇచ్చి 1 వికెట్ పడగొట్టాడు. అర్జున్ రాణించడంపై సచిన్ టెండూల్కర్ ఎక్స్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. "వెల్ డన్ అర్జున్. ఈ సీజన్ మొత్తం నువ్వు ఓపికగా ఉంటూ, కష్టపడిన విధానం చూసి గర్వంగా ఉంది. క్రికెట్ నీ నైపుణ్యాన్నే కాదు.. ఓపికను కూడా పరీక్షిస్తుంది. ఈ రోజు ఆ రెండింటినీ చక్కగా హ్యాండిల్ చేశావు. లవ్ యూ ఆల్‌వేస్" అంటూ కొడుకుపై ప్రేమను కురిపించారు.
అర్జున్ టెండూల్కర్ ప్రదర్శనపై సోదరి సారా టెండూల్కర్ కూడా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఎంతో భావోద్వేగంతో స్పందించారు. అర్జున్ వికెట్ తీసిన ఫోటోను షేర్ చేస్తూ.. "ఎంతో గర్వంగా ఉంది! నీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది" అంటూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు.