SA20 Auction Highlights | SA20 వేలంలో కోట్లు కురిపించిన ఫ్రాంఛైజీలు

సౌత్ ఆఫ్రికా టీ20 మెగా లీగ్ 4th ఎడిషన్‌కు ముందు జరిగిన మెగా వేలంలో డివాల్డ్ బ్రెవిస్, ఎయిడెన్‌ మార్‌క్రమ్‌ రికార్డులు బద్దలు కొట్టారు. ఈ ఇద్దరు ప్లేయర్స్ పై ఫ్రాంఛైజీలు కాసుల వర్షం కురిపించాయి. 

బేబీ ఏబీగా పిలవబడే డివాల్డ్ బ్రెవిస్‌ను 8.30 కోట్లు పెట్టి ప్రిటోరియా క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. సూపర్ ఫామ్‌లో ఉన్న బ్రెవిస్‌ ను టీమ్ లోకి తీసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆ ఫ్రాంఛైజీ.. మొత్తానికి సాధించింది. డెవాల్డ్ బ్రెవిస్ SA20 లీగ్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇక సన్‌రైజర్స్ ఈస్టర్న్ క్యాపిటల్స్‌ను రెండుసార్లు విజేతగా నిలిపిన ఎయిడెన్ మార్‌క్రమ్ ఈసారి ఫ్రాంఛైజీ మారాడు. మార్‌క్రమ్ ను డర్బన్ సూపర్ జెయింట్స్  7 కోట్లకు కొనుగోలు చేసింది. దక్షిణాఫ్రికా టీ20 లీగ్ నాలుగో సీజన్‌లో ఈ సౌతాఫ్రికా టీ20 కెప్టెన్ డర్బన్ సూపర్ జెయింట్స్ తరఫున ఆడనున్నాడు. దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌ నాలుగో ఎడిషన్.. 2025 డిసెంబర్ 26న ప్రారంభం కానుంది. 2026 జనవరి 26న ముగియనుంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola