Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో టీమ్ ఇండియా వరుస ఓటముల తర్వాత బిసిసిఐ కఠిన నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించింది. ఇండియన్ క్రికెట్ టీమ్ అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోషేట్, అలాగే ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్‌ల కాంట్రాక్టులను రీన్యూ చేయడం లేదని బిసిసిఐ అధికారికంగా స్పష్టం చేసింది. ఈ పరిణామంపై బిసిసిఐ సెక్రటరీ దేవజిత్ సైకియా పూర్తి క్లారిటీ ఇచ్చారు.
టెన్ డోషేట్ రెండేళ్ల కాంట్రాక్ట్ జూన్ 10తోనే పూర్తవగా, టి దిలీప్ వన్ ఇయర్ ఎక్స్‌టెన్షన్ గడువు జూన్ 8తోనే ముగిసిందని సైకియా తెలిపారు. యునైటెడ్ కింగ్‌డమ్ టూర్ ముగిసే వరకు వీరిని కొనసాగించినప్పటికీ, ఇకపై ఎక్స్‌టెన్షన్ ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కాంట్రాక్ట్ గడువు ముగియడంతో వీరి నుంచి రాజీనామాలు స్వీకరించే అవకాశం ఉంది.
కొత్త ఫీల్డింగ్ కోచ్ ఎంపిక కోసం బిసిసిఐ ఇప్పటికే చర్చలు ప్రారంభించింది. నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో గత ఆరేడేళ్లుగా పనిచేస్తున్న అస్సాంకి చెందిన శుభదీప్ ఘోష్ రేసులో ఫేవరెట్‌గా కనిపిస్తున్నాడు. త్వరలోనే కొత్త ఫీల్డింగ్ కోచ్ ఎంపిక పూర్తవుతుందని బిసిసిఐ వర్గాలు వెల్లడించాయి.