Ryan Rickelton Breaks Record IPL 2026 | 18 ఏళ్ల రికార్డ్ బద్దలు కొట్టిన ర్యాన్ రికెల్టన్

ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ హిస్టరీ క్రియేట్ చేసాడు. ముంబై ఇండియన్స్ టీమ్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని సరికొత్త రికార్డును లిఖించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో రికెల్టన్ పరుగుల సునామీ సృష్టించాడు.

ఈ మ్యాచ్‌లో ర్యాన్ రికెల్టన్ కేవలం 55 బంతుల్లోనే 10 ఫోర్లు, 8 సిక్సర్లతో 123 పరుగులు చేసాడు. లెజెండరీ బ్యాటర్ సనత్ జయసూర్య పేరిట ఉన్న 18 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. 2008 ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై జయసూర్య చేసిన 114 పరుగులే ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ తరఫున హైయెస్ట్ పర్సనల్ స్కోర్. తాజా ఇన్నింగ్స్‌తో రికెల్టన్ ఆ మార్కును అధిగమించి అగ్రస్థానానికి చేరుకున్నాడు.

ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక స్కోర్లు సాధించిన ప్లేయర్స్ లో రికెల్టన్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఇక ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 243 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్‌కు ఇది మూడో అత్యధిక స్కోరు కాగా, ఫస్ట్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసినప్పుడు మాత్రం ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola