Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

Continues below advertisement

టీమిండియా బ్యాట్స్మన్ రుతురాజ్ గైక్వాడ్ చరిత్ర సృష్టించాడు. లిస్ట్-ఏ క్రికెట్ హిస్టరీలోనే అత్యధిక బ్యాటింగ్ యావరేజ్ కలిగిన ప్లేయర్ గా నిలిచాడు. దాంతో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రికార్డ్‌ను అధిగమించాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా ముంబైతో జరిగిన మ్యాచ్‌లో మహారాష్ట్ర తరఫున బరిలోకి దిగిన రుతురాజ్ గైక్వాడ్.. 52 బంతుల్లో 66 పరుగులు చేసి ఈ రికార్డును బద్దలుగొట్టాడు. 

ఈ మ్యాచ్‌తో రుతురాజ్ గైక్వాడ్ లిస్ట్-ఏ క్రికెట్‌లో 57.69 యావరేజ్ ను నమోదు చేశాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యధిక బ్యాటింగ్ యావరేజ్ కలిగిన ప్లేయర్ లో విరాట్ కోహ్లీ 57.67 సగటుతో 16207 పరుగులు చేసి నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్ తో రుతురాజ్ గైక్వాడ్ 57.69 సగటుతో 4904 పరుగులు చేసి మూడో స్థానానికి చేరాడు. 

దేశవాళీ క్రికెట్ లో మంచి ఫార్మ్ లో కొనసాగుతున్న రుతురాజ్ గౌక్వాడ్ కు ఇండియా న్యూజీలాండ్ మధ్య జరిగే సిరీస్ లో చోటు దక్కలేదు. దేశవాళీ క్రికెట్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్ లో అద్భుత ప్రదర్శన చేస్తున్నప్పటికీ గైక్వాడ్‌ ను సెలెక్ట్ చేయకపోవడం అభిమానులను, మాజీ క్రికెటర్లను షాక్‌కు గురిచేసింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola