RR vs LSG IPL 2026 Highlights | లక్నోకు వరుసగా 4వ ఓటమి

ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జెయింట్స్ సొంతగడ్డపై రాజస్థాన్ రాయల్స్ తో ఓటమిపాలయింది. 40 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కుంది. ఇది లక్నోకు వరుసగా నాలుగో ఓటమి. 

తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 110 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి తడబడింది. ఆ టైంలో క్రీజ్ లోకి వచ్చిన రవీంద్ర జడేజా 29 బంతుల్లో 43 పరుగులు చేసి తన టీమ్ ను ఆదుకున్నాడు. శుభమ్ దూబే ఆఖర్లో రాణించడంతో రాజస్థాన్ 20 ఓవర్లలో 159 పరుగులు చేయగలిగింది. 

160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నోకు మొదట్లోనే షాక్ తగిలింది. రాజస్థాన్ బౌలర్ నండ్రే బర్గర్ తన స్పెల్ తో లక్నో పతనాన్ని శాసించాడు. కెప్టెన్ రిషభ్ పంత్, ఆయుష్ బదోని, ఎయిడెన్ మార్క్‌రమ్ వంటి స్టార్ ప్లేయర్లు డక్ అవుట్ అవడంతో లక్నోకు కోలుకోలేని దెబ్బ తీసింది. మిచెల్ మార్ష్ ఒంటరి పోరాటం చేసినప్పటికీ, అతనికి ఎవరి నుంచి సహకారం అందలేదు. రాజస్థాన్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లతో చెలరేగడంతో లక్నో 119 పరుగులకే ఆలౌట్ అయింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola