Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు

Continues below advertisement

ఇంగ్లాండ్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన మూడో వన్డేలో భారత్ ఓటమి పాలైనప్పటికీ.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఒక అరుదైన చారిత్రాత్మక రికార్డుతో సంచలనం చేశారు. భారత్ తరఫున కలిసి 400 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన తొలి జోడీగా రోహిత్-విరాట్ రికార్డు పుస్తకాల్లోకి ఎక్కారు. 

ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగగా, విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇటీవలి కాలంలో 2027 వన్డే వరల్డ్ కప్‌లో వీరిద్దరి లో వీళ్లిద్దరు ఉండరు అని వస్తున్న ట్రోల్స్‌కు, అలాగే గంభీర్, మేనేజ్‌మెంట్ కు తమ బ్యాట్‌తోనే సమాధానం చెప్పారు. 

టీమ్ మేనేజ్‌మెంట్ సరైన నిర్ణయాలు తీసుకోకపోతే ఎంతటి మ్యాచ్ అయినా చేజారిపోతుందని ఈ ఓటమితో హెచ్చరించారు. టెస్టులు, టీ20లకు గుడ్‌బై చెప్పిన ఈ జోడీ.. ప్రస్తుతం వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన 2వ, 3వ బ్యాటర్లుగా ఉన్నారు. 18 ఏళ్లుగా జట్టుకు ఎన్నో విజయాలు అందించిన రోహిత్-విరాట్, 2027 వన్డే ప్రపంచ కప్ గెలవడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola