Rohit, Virat BCCI Contracts Changes | విరాట్, రోహిత్‌కు బీసీసీఐ షాక్?
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) త్వరలో ఒక పెద్ద నిర్ణయం తీసుకోనుంది. ఈ నిర్ణయంతో రోహిత్ శర్మ ( Rohit Sharma ), విరాట్ కోహ్లీ ( Virat Kohli ) వంటి స్టార్ ఆటగాళ్ల జీతాలను తగ్గే ఛాన్స్ ఉంది. బీసీసీఐ కాంట్రాక్ట్ నుంచి A+ కేటగిరీని రద్దు చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది.
A+ కేటగిరీని రద్దు చేయడంతో పాటు, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను B కేటగిరీలోకి చేర్చావోచ్చని తెలుస్తుంది. ఇది అంతాకూడా 2027 ప్రపంచ కప్ కంటే ముందు జరగనుందట. ప్రస్తుతం రోహిత్, కోహ్లీ A+ కేటగిరీ కింద BCCI నుంచి సంవత్సరానికి 7 కోట్ల రూపాయలు పొందుతున్నారు. B కేటగిరీలో ఉన్న ఆటగాళ్లకు 3 కోట్ల రూపాయలు అందుతాయి.
ప్రస్తుతం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డేలో మాత్రమే ఆడుతున్నారు. ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు T20 ఇంటర్నేషనల్, టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. ఒక ఫార్మాట్‌లో మాత్రమే ఆడుతున్నందున వారి కాంట్రాక్ట్ తగ్గించవచ్చు. ఇద్దరి సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఏదైనా మార్పు జరిగితే, దాదాపు ఒక దశాబ్దం తర్వాత రోహిత్-విరాట్ B కేటగిరీ కాంట్రాక్ట్‌లోకి వెళతారు. అయితే, అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ప్రస్తుతం A+ గ్రేడ్ లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా ఉన్నారు. A గ్రేడ్ లో మహ్మద్ సిరాజ్, కెఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా, మహ్మద్ షమీ, రిషబ్ పంత్ ఉన్నారు.