Rohit Sharma Virat Kohli 2027 ODI World Cup | చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కీలక ప్రకటన

ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత్ వన్డే, టీ20 జట్లను ప్రకటించింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను ఈ వన్డే సిరీస్‌కు ఎంపిక చేశారు. రోహిత్ శర్మ వన్డే టీమ్ లో ఉన్నప్పటికీ కూడా శుభ్‌మన్ గిల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. దాంతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2027 వన్డే ప్రపంచ కప్‌లో ఆడటంపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ విషయంపై బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు.

అజిత్ అగార్కర్‌ కు ప్రెస్ కాన్ఫరెన్స్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు 2027 వన్డే ప్రపంచ కప్‌లో ఆడతారా అన్న ప్రశ్న ఎదురైంది. ఈ విషయంపై అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. 'రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రస్తుతం దీని గురించి ఏమీ రివీల్ చేయాలనీ అనుకోవట్లేదు ' అని తెలివిగా సమాధానం చెప్పారు. కొన్ని రోజుల క్రితమే రోహిత్, కోహ్లీ లాంటి ప్లేయర్స్ వన్డే ప్రపంచ కప్‌లో కీలక ప్లేయర్స్ అవుతారని బీసీసీఐ చెప్పుకొచ్చింది. 
అప్పటి వరకు రోకో ఫిట్ గా ఉండటం ముఖ్యం, ఫాంలోనూ ఉండాలి. కానీ తాజాగా అగార్కర్ మాటలు వింటుంటే వచ్చే ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్ వారి కెరీర్ ను డిసైడ్ చేస్తుందని అనిపిస్తుందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola