త్వరలోనే టెస్ట్ మ్యాచ్‌లకి రోహిత్ శర్మ గుడ్‌బై!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాడా. ఈ రోజు రోహిత్ శర్మ చేసిన ఓ పని ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అదేటంంటే హిట్ మ్యాన్ మూడో టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో క్రూషియల్ టైమ్ లో కేవలం 10 పరుగులకే అవుట్ అయ్యాడు. అస్సలు ఫుట్ వర్క్ బాగాలేకపోవటంతో తనే చాలా నిరాశకు లోనవటం కనిపించింది. అవుటై పెవిలియన్ కు వెళ్లే సమయంలో రోహిత్ తన గ్లౌజులను క్రీజు దాటాక డగౌట్ ముందు పేర్చి వెళ్లాడు. పోనీ తడిసినవని వదిలేశాడా అంటే అసలు బ్రిస్బేన్ లో ఎండేలేదు. వర్షం పడుతోంది. సో రోహిత్ శర్మ తన టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాడనే ఊహాగానాలతో సోషల్ మీడియాలో ఊగిపోతోంది. గడచిన 10 టెస్టుల్లో 18 ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ శర్మ 600పరుగులు మాత్రమే చేశాడు. అందులో ఒకే ఒక్క సెంచరీ ఉంది. ప్రత్యేకించి ఈ సీజన్ లో ఫస్ట్ ఇన్నింగ్ లో రోహిత్ శర్మ యావరేజ్ కేవలం 8.85 మాత్రమే. దీంతో హిట్ మ్యాన్ తను టీమ్ కు భారం కాకూడదని డెసిషన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయంటూ ఫ్యాన్స్ అయితే తెగ పోస్టులు పెడుతున్నాడు. ఫాలో ఆన్ గండం తప్పిన తర్వాత రోహిత్ శర్మ డ్రెస్సింగ్ రూమ్ లో నవ్వుతూ కనిపించాడు. మరి ఈ గ్లౌజులు వదిలేయటం క్యాజువల్ గా ఫ్రస్ట్రేషన్ లో చేశాడా లేదా ఏదన్నా డెసిషన్ ఉంటుందా వేచి చూడాలి.