బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

నవంబర్ 22 నుంచి బార్డర్ గవాస్కర్ ట్రోఫీ మొదలు కానుంది. ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో ఆప్టస్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో తలపడనుంది టీమిండియా. అయితే..ఈ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌కి రోహిత్ శర్మ దూరం కానున్నాడు. ఈ మధ్యే రోహిత్ శర్మ, రితికకి రెండో బిడ్డ పుట్టాడు. ఈ కారణంగానే రోహిత్...ఈ టెస్ట్ మ్యాచ్ ఆడే అవకాశాలు లేవని తెలుస్తోంది. అయితే...డిసెంబర్ 6వ తేదీన అడెలైడ్‌లో జరగనున్న రెండో టెస్‌ మ్యాచ్‌లో హిట్ మ్యాన్‌ జాయిన్ అవనున్నాడు. ఈ విషయాన్ని ముందే బీసీసీఐకి ఇన్‌ఫామ్ చేశాడు రోహిత్ శర్మ. అందుకే ఈ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ వరకూ వైస్‌ కేప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా కేప్టెన్ బాధ్యతలు తీసుకోనున్నాడు. అంతకు ముందు కూడా బుమ్రా టెస్ట్ మ్యాచ్‌లలో కేప్టెన్‌గా చేశాడు. 2021-22లో ఇంగ్లాడ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌ సమయంలో రోహిత్ శర్మకి కొవిడ్ పాజిటివ్ వచ్చింది. ఆ టైమ్‌లో బుమ్రా..టీమిండియాని లీడ్ చేశాడు. 

అయితే...రోహిత్‌తో పాటు మరో కీ ప్లేయర్ శుభ్‌మన్ గిల్ కూడా మ్యాచ్‌కి దూరం కానున్నాడు. బొటన వేలుకి గాయం కావడం వల్ల ఆడలేకపోతున్నట్టు చెప్పాడు. నిజానికి కేఎల్ రాహుల్‌ కూడా మోచేతి గాయంతో బాధ పడుతున్నాడు. రాహుల్ కూడా ఈ మ్యాచ్ ఆడతాడో లేడో అన్న డౌట్ ఉండేది. కానీ...మరీ ఆడలేని స్థితిలో అయితే లేడు. గవాస్కర్ ట్రోఫీకి కొద్ది రోజుల సమయమే ఉండడం వల్ల గౌతమ్ గంభీర్‌పై ప్రెజర్ పెరుగుతోంది. గంభీర్ అండర్‌లో ఇండియా ఆడుతున్న ఫస్ట్ ఓవర్సీస్ టెస్ట్ సిరీస్ ఇదే. పైగా ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో ఇండియా వైట్ వాష్ అవడం వల్ల గవాస్కర్ ట్రోఫీపై అంచనాలు భారీగా పెరిగాయి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola