Rohit Sharma T20 World Cup | హిట్మ్యాన్ లేకుండా తొలి వరల్డ్ కప్
టీమ్ ఇండియా స్టార్ బ్యాట్సన్ రోహిత్ శర్మ 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడు. అప్పటి నుంచి కేవలం వన్డే మ్యాచులు మాత్రమే ఆడుతున్నాడు. అయితే 2026లో జరగబోయే టీ20 వరల్డ్ కప్... రోహిత్ శర్మ లేకుండా ఆడుతున్న మొదటి వరల్డ్ కప్ కానుంది.
2007 లో రోహిత్ తన మొదటి టీ20 వరల్డ్ కప్ ను ఆడాడు. అప్పుడు అతని వయసు 20 ఏళ్ళు. టీ20 వరల్డ్ కప్ ప్రారంభమైనప్పటి నుంచి అన్ని ఎడిషన్లలో ఆడిన ఏకైక ఆటగాడు రోహిత్ శర్మ. గత 18 ఏళ్లలో తొలిసారిగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుండా భారత్ ఐసీసీ టోర్నీలో బరిలోకి దిగుతోంది. రోహిత్ శర్మ ఎప్పటి 9 టీ20 వరల్డ్ కప్ లను ఆడాడు. విరాట్ కోహ్లీ, ధోని 6 టీ20 వరల్డ్ కప్ లను ఆడారు.
2007 లో టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్ మొదలయింది. అప్పటి నుంచి టీమ్ ఇండియా 2007, 2024 లో విజేతగా నిలిచింది. 2007లో ధోనీ సారథ్యంలో తొలి కప్పును గెలిచిన టీమ్ ఇండియా, 2014లో రన్నరప్‌గా, 2016, 2022లో సెమీఫైనలిస్ట్‌గా నిలిచింది. గత 9 ఎడిషన్లలో భారత్ సక్సెస్ ఫుల్ టీమ్ గా నిలిచింది.