Rohit Sharma Playing His Last For MI | ముంబైకి రోహిత్ గుడ్‌బై చెప్పేస్తున్నాడా? | ABP Desam

ఐపీఎల్‌లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడనున్నాయి. ప్లేఆఫ్స్ రేసు పరంగా ఈ మ్యాచ్‌కు అంత ప్రాధాన్యం లేకపోయినా... ఇది ఒక చారిత్రాత్మక మ్యాచ్‌గా నిలిచే అవకాశం ఉంది. ఎందుకంటే ముంబై ఇండియన్స్ జట్టును ఇన్నాళ్లూ తనలో ఒక భాగంలా చూసుకున్న రోహిత్‌కు ముంబై ఇండియన్స్ తరఫున ఇదే ఆఖరి మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ సీజన్ తర్వాత రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌ను వీడవచ్చని వార్తలు వస్తున్నాయి. కోల్‌కతా నైట్‌రైడర్స్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌తో రోహిత్ మాట్లాడిన వీడియో కూడా గతంలో వైరల్ అయింది. ‘అన్ని విషయాలూ చాలా వేగంగా మారిపోతున్నాయి. ముంబై ఇండియన్స్ టీమ్ అనేది నేను కట్టిన గుడి. కానీ ఇదే నాకు చివరిది అవుతుంది.’ అన్నాడు. ఈ వీడియో తర్వాత రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌ను వీడతాడనే వార్తలు మరింత బలపడుతున్నాయి. రోహిత్‌తో పాటు స్టార్ బౌలర్ బుమ్రా, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ కూడా బయటకు వచ్చేస్తారని తెలుస్తోంది. ఒకవేళ రోహిత్ శర్మ 2025 మెగా ఆక్షన్‌లోకి వస్తే... ఏ టీమ్‌లోకి ఆడితే బాగుంటుందో కామెంట్ చేయండి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola