దిగ్గజాల నీడలోంచి వెలుగుతున్న సూరీడులా.!'కెప్టెన్ రోహిత్' మర్చిపోలేని 2021
Continues below advertisement
టీ20ల్లో శతకాలు, వన్డేల్లో ద్విశతకాలతో మురిపించే రోహిత్ శర్మకు సుదీర్ఘ ఫార్మాట్లోనూ ఓపెనర్‌గా అరంగేట్రం చేశాడు. వరుస శతకాలతో ఇరగదీశాడు. టీమ్‌ఇండియాలో తనను వెలెత్తి చూపకుండా చేసుకున్నాడు.గగన సీమలోని సూర్యుడు నిరంతరం ప్రకాశిస్తూనే ఉంటాడు. కానీ భూమ్మీద ఉండేవారికి మాత్రం చీకటి తెరలు కమ్మినట్టు అనిపిస్తుంది. టీమ్‌ఇండియా పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మా ఇంతే! దిగ్గజాల నీడలో నిరంతరం ఉదయిస్తూనే ఉన్నాడు. అభిమానులకు 'టన్ను'ల కొద్దీ ఆనందం పంచుతున్నాడు. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా 2021లో హిట్‌మ్యాన్ మరింత ఎదిగాడు.
Continues below advertisement