Rohit Sharma Golden Duck | రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్

Continues below advertisement

విజయ్ హజారే ట్రోఫీలో భారత స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసిన రోహిత్ శర్మ తరువాత మ్యాచులో విఫలమయ్యాడు. ముంబై ఉత్తరాఖండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో రోహిత్ తొలి బంతికే గోల్డెన్ డకౌట్ అవడంతో ముంబై టీమ్ క పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. 

మొదటి రౌండ్‌లో జరిగిన మ్యాచులో సిక్కింపై 155 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు రోహిత్. ఆ మ్యాచ్ కు అభిమానులు భారీగా తరలివచ్చారు. అయితే మరో బిగ్ ఇన్నింగ్స్ ఆడతాడని భావించి భారీగా తరలివచ్చిన అభిమానులకు షాక్ తగిలింది. ముంబై ఉత్తరాఖండ్ మధ్య జరిగిన మ్యాచ్ రోహిత్ గోల్డ్ డకౌట్ కావడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. రోహిత్ ఔట్ అయిన వెంటనే ఫ్యాన్స్ స్టేడియాన్ని వీడారు. ఆ తర్వాత ముంబై యంగ్ ప్లేయర్స్ మంచు స్కోర్ ను చేసారు. ఫలితంగా ముంబై మ్యాచ్ ను సొంతం చేసుకుంది. 2025–26 విజయ్ హజారే ట్రోఫీలో భారత స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో పాటు మరికొందరు స్టార్ ప్లేయర్స్ కూడా ఆడుతున్నారు. దాంతో దేశవాళీ క్రికెట్ కు ఫ్యాన్స్ నుంచి మంచి స్పందన వస్తుంది. తమ ఫేవరెట్ ప్లేయర్స్ ను చూసేందుకు భారీగా తరలి వస్తున్నారు అభిమానులు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola