ఆ క్రెడిట్ ద్రవిడ్‌దే..! గంభీర్‌కి షాకిచ్చిన రోహిత్

Continues below advertisement

కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మని తీసేయడానికి కీ రీజన్‌గా చెప్పుకుంటున్న కోచ్ గౌతం గంభీర్‌కి హిట్ మ్యాన్ భారీ షాకిచ్చాడు.  మంగళవారం CEAT Cricket Rating అవార్డ్స్ ఫంక్షన్‌ జరిగింది. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించినందుకు స్పెషల్ అవార్డ్  దక్కించుకున్నాడు రోహిత్. అయతే కెప్టెన్సీ పొగొట్టుకున్న తర్వాత.. ఫస్ట్ టైం పబ్లిక్ ఈవెంట్లో కనిపించడంతో హిట్ మ్యాన్ ఏం మాట్లాడతాడా..? అని అంతా ఆసక్తిగా ఉన్న టైంలో.. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమ్ విజయానికి రాహుల్ ద్రవిడే కారణమంటూ ఆకాశానికెత్తేశాడు.

మా గెలుపు ఏదో ఒక సంవత్సరం లేదా రెండు సంవత్సరాల కృషి కాదు. చాలా ఏళ్లుగా పడిన కష్టానికి ఫలితం. టైటిల్‌కు చాలాసార్లు closeగా వచ్చినా గెలవలేకపోయాం. అందుకే something differentగా చేయాలని నిర్ణయించుకుని.. ఆ ఆలోచనతోనే టైటిల్ కొట్టాం. దానికి ప్రధాన కారణం రాహుల్ ద్రవిడే..’ అంటూ ద్రవిడ్‌తో తనకున్న బాండింగ్‌ని పంచుకున్నాడు. అయితే విచిత్రం ఏంటంటే.. టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో గెలిచింది. కానీ.. ద్రవిడ్ టీమిండియా కోచ్‌గా 2024 టీ20 వరల్డ్ కప్‌ వరకే ఉన్నాడు.

ఆ తర్వాత తన స్పీచ్ మొత్తంలో ఎక్కడా ప్రస్తుత హెడ్ కోచ్ Gautam Gambhir 2024 జూలైలో గౌతం గంభీర్ టీమ్‌కి హెడ్ కోచ్ అయ్యాడు. నిజానికి ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఆడింది గంభీర్ కోచింగ్‌లోనే. మరి అలాంటి ట్రోఫీ గెలిచినప్పుడు కోచ్‌గా ఉన్న గంభీర్ గురించి కాకుండా.. అంతకుముందు కోచ్‌గా ఉన్న ద్రవిడ్‌కి హిట్‌మ్యాన్  క్రెడిట్ ఇవ్వడం అండ్ కనీసం గంభీర్ పేరును కూడా ఎక్కడా మెన్షన్ చేయకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీంతో రోహిత్ వర్సెస్ గంభీర్ వార్ మొదలైందంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola