Rohit Sharma diet Plan । 95 కేజీల నుంచి 75 కేజీలకు తగ్గిన రోహిత్ శర్మ డైట్ సీక్రెట్ ఇదే

Ceat cricket awards event లో టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ని చూసి షాక్ అవ్వని వాళ్ళు లేరు. నిన్న, మొన్నటి వరకు భారీగా బరువు పెరిగిపోయి.. పూర్తిగా shape out అయిపోయి.. విపరీతంగా trolls ఎదుర్కున్న రోహిత్.. just 4 నెలల్లో కళ్ళు చెదిరే రీతిలో బరువు తగ్గాడు. ఇంతకుముందు 95 కేజీల బరువున్న రోహిత్.. ఇప్పుడు 75 కిలోల వెయిట్ తో కరెంట్ తీగలా సన్నగా మారి.. ఫిట్‌నెస్ ఫ్రీక్ విరాట్ కోహ్లీ మాదిరి ఫుల్ ఫిట్ గా కనిపిస్తున్నాడు.
అయితే బరువు తగ్గేందుకు రోహిత్ శర్మ అందరిలా కడుపు మాడ్చుకోలేదట. హాయిగా రోజుకి 7 పూటలు తింటూ బరువు తగ్గాడట. దీంతో ఇప్పుడు hitman డైట్ ప్లాన్ పై విపరీతంగా చర్చ జరుగుతోంది. మరి రోహిత్ ఫాలో అయిన ఆ డైట్ ప్లాన్ ఏంటంటే.. ఉదయం లేవగానే 6 నానబెట్టిన బాదం పప్పులు, మొలకెత్తిన సలాడ్, తాజా జ్యూస్‌ తినడం... 9.30 కి బ్రేక్ ఫస్ట్ లో తాజా పండ్లతో కూడిన ఓట్‌మీల్, ఓ గ్లాస్ పాలతో సరిపెట్టడం.. 11.30 కి పెరుగు, చిల్లా, కొబ్బరి నీళ్లు, ప్రొబయోటిక్స్, ప్రోటీన్‌.. ఇది morning డైట్.
ఇక మధ్యాహ్నం 1.30 కి లంచ్ లో వెజిటేబుల్ కర్రీ, పప్పు, అన్నం, సలాడ్‌ తీసుకునేవాడు. సాయంత్రం 4.30 గంటల సమయంలో డ్రైఫ్రూట్స్‌తో కూడిన ఫ్రూట్ స్మూతీని తాగేవాడు. రాత్రి 7.30 కి కూరగాయలు, పులావ్, వెజిటేబుల్ సూప్, ప్రొటీన్‌తో డిన్నర్ పూర్తి చేసేవాడు. చివరిగా 9.30 కి పడుకునే కాసేపు ముందు ఒక గ్లాస్ పాలు తాగేవాడు. ఇదే హిట్ మన్ డైట్. మరి మీరు కూడా వెయిట్ తగ్గాలంటే ఓ సారి ఈ diet try చేయండి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola