Rohit Sharma Advice to Tilak Varma IPL 2026 | రోహిత్ సలహాతోనే సెంచరీ అంటున్న తిలక్

గుజరాత్ టైటాన్స్‌ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో తిలక్ వర్మ సెంచరీతో అక్కటుకునాడు. అయితే తన క్రెడిట్ మొత్తం హిట్ మ్యాన్ రోహిత్ శర్మకే దక్కుతుందని అంటున్నాడు ఈ యంగ్ బ్యాటర్. 

సీజన్ మొదటి నుంచే పరుగులు చేయక ఇబ్బంది పడుతున్న టైంలో  రోహిత్ శర్మ తనకు సలహా ఇచ్చాడని తిలక్ తెలిపాడు. "క్రీజులోకి వెళ్ళాక అవుట్ కం గురించి ఆలోచించకుండా, ఫస్ట్ 15-20 బాల్స్ ఓపికగా ఆడమని రోహిత్ భాయ్ చెప్పాడు. ఆ తర్వాత ఏం చేయాలో నీకే అర్థమవుతుందని భరోసా ఇచ్చాడు. ఆయన చెప్పినట్లే చేయడం వల్ల నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది, షాట్లు ఆడగలిగాను" అని తిలక్ వివరించాడు. 

సూర్యకుమార్ యాదవ్ ఫామ్‌పై వస్తున్న విమర్శలను తిలక్ కొట్టిపారేశాడు. "సూర్య భాయ్ నెట్స్‌లో బాల్ ను అద్భుతంగా మిడిల్ చేస్తున్నాడు. అతను టచ్ కోల్పోలేదు, ఒక భారీ ఇన్నింగ్స్ కోసం ఎదురుచూస్తున్నాడంతే. ప్రపంచకప్‌లో అతను ఆడిన ఇన్నింగ్స్ మనందరికీ తెలిసిందే" అని సూర్యకు సపోర్ట్ గా నిలిచాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola