Rohit Sharma about Test Retirement | టెస్ట్ ఫార్మాట్ పై రోహిత్ కామెంట్స్
స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి తన ఫ్యాన్స్ ను షాక్ కు గురి చేసారు. ఆ తర్వాత తన రిటైర్మెంట్ గురించి రోహిత్ శర్మ ఎక్కడా మాట్లాడలేదు. కానీ రోహిత్ సడన్ రిటైర్మెంట్ పై చాలా డిబేట్స్ జరిగాయి. అయితే తాజాగా తన టెస్ట్ కెరీర్‌పై హిట్ మ్యాన్ కీలక వ్యాఖ్యలు చేసారు. టెస్ట్ క్రికెట్ చాలా కఠినమైన ఫార్మాట్ అంటూ కామెంట్స్ చేశాడు. టెస్టు మ్యాచ్‌లు అంటే ఐదు రోజులు నిలబడి ఆడటమే కాదు.. ఫోకస్, మెంటల్ స్ట్రెంత్ ఉండాలి. చిన్నప్పుడే ముంబైలో క్లబ్ క్రికెట్‌లో ఆడడం వల్ల నాకు అలవాటు అయిపోయింది. ఆలా చిన్నప్పుడు ఆడడం వల్లే మెంటల్ స్ట్రెంత్ వచ్చిందని అన్నాడు హిట్ మ్యాన్. టెస్టులో టాప్ లెవెల్ పెర్ఫార్మన్స్ అంటే ఫోకస్, కాన్సంట్రేషన్, మెంటల్ గా ప్రిపేర్డ్ గా ఉండడమే. అది లేదంటే ఐదు రోజులు నిలబడడం కష్టం. గేమ్ మొదలైన తర్వాత ప్రతి సెకండ్ అందుకు రియాక్షన్ మాత్రమే.. ఆ రియాక్షన్ సరిగ్గా రావాలంటే ముందు చేసుకునే ప్రిపరేషన్ చాలా ముఖ్యమని అంటున్నాడు రోహిత్ శర్మ.