Robin Uthappa on Gambhir Ind vs SA | గంభీర్ పై ఉత్తప్ప కామెంట్స్

Continues below advertisement

టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకుంటున్న నిర్ణయాలపై రోజు రోజుకి చర్చలు ఎక్కువ అవుతున్నాయి. బ్యాటింగ్ లైన్ అప్ లో గంభీర్ చేస్తున్న మార్పుల కారణంగానే టీమ్ ఇండియా ఇలా వరుసగా ఓటమి పాలవుతుందని అందరు అంటున్నారు. కానీ ఈ విషయంపై గంభీర్ ఇంకా స్పందించలేదు. అయితే గౌతమ్ గంభీర్ వ్యూహాన్ని మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప ప్రశ్నిస్తున్నారు. 

పెద్ద స్కోర్ ను చేజ్ చేస్తున్నప్పుడు భారత బ్యాటింగ్ వ్యూహంలో ఎలాంటి క్లారిటీ లేదని అంటున్నారు. "సమస్య వికెట్లు కాదని, శుభ్‌మాన్ గిల్ ఔట్ తర్వాత అనుసరించిన వ్యూహమని ఉతప్ప అన్నారు. భారత్ బలమైన బ్యాటింగ్ ఆర్డర్‌ను పెట్టుకొని.. దాని సమర్థవంతంగా ఉపయోగించుకోలేదు అని అంటున్నారు ఉత్తప్ప. ఆయన మాట్లాడుతూ, "శుబ్‌మాన్ గిల్ ఔట్ అయినప్పుడు, అక్షర్ పటేల్ బ్యాటింగ్‌కు వచ్చాడు. ఆ సమయంలో, అభిషేక్ శర్మపై ఒత్తిడిని తగ్గించడానికి రిస్క్ తీసుకొని త్వరగా స్కోరు చేసే బ్యాట్స్‌మన్ పాత్రను పోషించాల్సి వచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో, బ్యాట్స్‌మెన్ తమ పాత్రల గురించి మరియు ఇన్నింగ్స్‌ను ఎలా నిర్మించాలో స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి" అని అన్నారు. 

"మొదటి ఆరు నుండి ఎనిమిది ఓవర్ల తర్వాత బ్యాట్స్‌మెన్ పెద్ద స్కోరును ఛేదించడానికి బలమైన పునాది అవసరం. ఫౌండేషన్ లేకుండా స్కై స్క్రాపర్ కడతానంటే కష్టం అని అంటున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola