ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?
Ms Dhoniకి ఇదే లాస్ట్ ఐపీఎలా? Ipl2026 తర్వాత ధోనీని మనం మళ్లీ గ్రౌండ్ లో యెల్లో జెర్సీలో చూడలేమా? ప్రస్తుతం మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసిన ఆటగాళ్లను చూస్తే అవుననే అనిపిస్తోందన్నాడు టీం ఇండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప. ‘రాబోయే ipl ధోనీకి ఆఖరిది కావొచ్చు. మళ్లీ 2027 ipl కూడా ఆయన ఆడతారని నేనైతే అనుకోవట్లేదు. ప్రస్తుతం టీం బిల్డ్ చేస్తున్న విధానం చూస్తే అదే అర్థమవుతోంది. లాస్ట్ ఇయర్ తో పాటు ఈ ఇయర్ జరిగిన మినీ వేలంలోనూ csk యంగ్ ప్లేయర్స్ పైనే ఎక్కువగా ఖర్చు చేసింది. ఇక కెప్టెన్సీ కోసం కూడా ఆల్రెడీ ఋతూరాజ్ టీంలో వుండగానేలో సంజు లాంటి సెకండ్ ఆప్షన్ కూడా రెడీ చేసుకుంది. దానికి తోడు సంజు వికెట్ కీపర్ కూడా. అంటే ధోనీకి పర్ఫెక్ట్ replacement. అంటే ఇకపై టీంలో ఎలాంటి సమస్యా వచ్చినా యంగ్ జనరేషన్ చూసుకునేలా టీం బిల్డ్ అవుతోంది. దీనివల్లే 2027 Ipl ధోనీ ఆడే ఛాన్స్ కనిపించడం లేదు. కానీ టీంలో లేకపోయినా csk mentor గా ధోనీ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది‘ అంటూ ఉతప్ప చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.