Ro - Ko at India vs South Africa ODI | రాంచీలో రో - కో జోడి

టెస్ట్ సిరీస్ లో వైట్ వాష్ కు గురైన తర్వాత టీమ్ ఇండియా సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్ ఆడనుంది. టెస్ట్ లో పోగొట్టుకున్న పరువును వన్ డే సిరీస్ తో దక్కించుకోవాలని కసిగా ఉంది టీమ్ ఇండియా. అయితే ఈ వన్ డే సిరీస్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా ఆడబోతున్నారు. దాంతో ఫ్యాన్స్ అంతా వీరిపైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో వన్ డే సిరీస్ లో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ జోడి కొత్త రికార్డులను బ్రేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. 

భారత లెజెండరీ ప్లేయర్స్ సచిన్ తెందుల్కర్, రాహుల్ ద్రవిడ్... వీళ్లిద్దరు కలిసి ఇంటర్నేషనల్ క్రికెట్ లో జోడీగా భారత్​ తరఫున 391 మ్యాచ్‌లు ఆడారు. వీళ్ల తర్వాత ఆ పొజిషన్ ను రోహిత్ విరాట్ కోహ్లీ భర్తీ చేసారు. 

రోహిత్‌ , కోహ్లీ జోడీగా 391 ఇంటర్నేషనల్ మ్యాచ్​లు ఆడారు. రాంచీలో జరిగే వన్డేలో ఈ ఇద్దరూ కలిసి క్రీజులో ఉంటే ఆ నెంబర్ కాస్త 392 కి చేరుతుంది. దాంతో సచిన్- ద్రవిడ్ రికార్డ్ బ్రేక్ అవుతుంది. కాబట్టి సఫారీలతో జరుగుతున్న ఈ వన్ డే మ్యాచ్ లో ఎలాగైనా రోహిత్ కోహ్లీ... సచిన్- ద్రవిడ్ రికార్డ్ ను బ్రేక్ చేయాలనీ వారి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  ఇప్పటికే వీళ్లిద్దరు రాంచీ చేరుకొని నెట్స్​లో ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola