Riyan Parag Consoling Vaibhav Suryavanshi | డగౌట్ లో ఏడ్చేసిన వైభవ్ సూర్యవంశీ

Continues below advertisement

క్వాలిఫయర్-2 లో గుజరాత్ టైటాన్స్ చేతిలో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఓటమి తర్వాత రాజస్థాన్ క్యాంప్‌లో గుండెల్ని పిండేసే దృశ్యాలు కనిపించాయి. ఈ సీజన్ అంతా ఒంటిచేత్తో మ్యాచ్‌లు గెలిపించి, ప్రస్తుతం 776 పరుగులతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా ఉన్న 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ.. మ్యాచ్ ముగిసిన తర్వాత డగౌట్ లో ఒంటరిగా కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపించాడు.

క్వాలిఫయర్-2 లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 9 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో వైభవ్ సూర్యవంశీ, రవీంద్ర జడేజాతో కలిసి సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 47 బంతుల్లో 7 సిక్సర్లు, 8 ఫోర్లతో 96 పరుగులు చేసి జట్టుకు 214 పరుగుల భారీ స్కోరు అందించాడు. దురదృష్టవశాత్తూ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సెంచరీ మిస్ అయ్యాడు. అయితే, ఛేజింగ్‌లో గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుత సెంచరీతో రాణించడంతో, GT 7 వికెట్ల తేడాతో విజయం సాధించి మే 31న ఆర్సీబీతో ఫైనల్ పోరుకు సిద్ధమైంది.

మ్యాచ్ అయిపోయాక తీవ్ర భావోద్వేగానికి లోనైన వైభవ్ ఏడుస్తుంటే.. కెప్టెన్ రియాన్ పరాగ్ అతడి దగ్గరకు వెళ్లి హాగ్ చేసుకున్నాడు. డగౌట్‌తో పాటు డ్రెస్సింగ్ రూమ్‌లో కూడా పరాగ్ అతడి భుజంపై చేయి వేసి ఓదార్చాడు. ఇందుకు సంబందించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola