Rishabh Pant Injury IPL 2026 vs RCB |నొప్పితో మైదానం వీడిన రిషబ్ పంత్

చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bangalore ), లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్‌లో ఒక ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఎల్‌ఎస్‌జీ కెప్టెన్ రిషబ్ పంత్ బ్యాటింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డాడు. మూడవ ఓవర్‌లోనే ఎయిడెన్ మార్క్రమ్ అవుట్ అవ్వడంతో క్రీజులోకి వచ్చిన పంత్, జోష్ హాజిల్‌వుడ్ వేసిన నాలుగో ఓవర్‌లో ఇబ్బంది పడ్డాడు. హాజిల్‌వుడ్ వేసిన షార్ట్ డెలివరీని ఆడబోయినప్పుడు బాల్ నేరుగా పంత్ లెఫ్ట్ ఎల్బో కి చాలా బలంగా తగిలింది. విపరీతమైన నొప్పితో పంత్ గ్రౌండ్ లోనే విలవిలలాడిపోయాడు.

ఫిజియో వచ్చి బేసిక్ ట్రీట్మెంట్ చేసినా కూడా పంత్ కు నొప్పి తగ్గలేదు. రిషబ్ పంత్ నొప్పి తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకోవడంతో ఒక్కసారిగా స్టేడియం సైలెంట్ అయిపోయింది. బ్యాటింగ్ చేయలేక రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్ చేరాడు. 16వ ఓవర్‌లో ఆయుష్ బదోని అవుట్ అయిన తర్వాత, చేతికి బ్యాండేజ్ కట్టుకుని మళ్ళీ క్రీజులోకి వచ్చాడు. అయితే ఒక్క పరుగుకే వెనుదిరగ‌డం ఫ్యాన్స్ డిస్సపాయింట్ అయ్యారు. రిషబ్ పంత్ త్వరగా కోలుకుని పూర్తి ఫిట్‌నెస్‌తో మ్యాచ్‌లు ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola