Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

భారత క్రికెటర్ రింకూ సింగ్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. రింకూ సింగ్ తండ్రి ఖంచంద్ర సింగ్ కన్నుమూశారు. ముంబైలోని ఒక హాస్పిటల్ లో చివరి శ్వాస విడిచారు. రింకూ తండ్రి స్టేజ్-4 లివర్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఇటీవల ఆయన ఆరోగ్యం బాగా క్షీణించడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు.  

వరల్డ్ కప్ టోర్నీ ఆడుతున్న రింకు తన తండ్రి ఆరోగ్యం క్షీణించిందన్న సమాచారంతో నోయిడాకు వెళ్ళాడు. తిరిగి జింబాబ్వేతో మ్యాచ్ కు జట్టుతో చేరాడు. ఈ మ్యాచ్‌లో రింకూకు అవకాశం లభించలేదు. కానీ మధ్యలో వచ్చి ఫీల్డింగ్ చేసాడు. మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తండ్రి ఖంచంద్ర సింగ్ చనిపోయారన్న సమాచారం అందుకున్న వెంటనే రింకూ సింగ్ తన స్వస్థలానికి బయలుదేరాడు. 

ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన రింకు సింగ్, తన తండ్రి సపోర్ట్ తోనే ఈ స్థాయికి చేరుకున్నారు. గ్యాస్ సిలిండర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో పని చేసిన ఖంచంద్ర సింగ్, ఎంత కష్టం వచ్చినా రింకును మాత్రం క్రికెట్ కు దూరం చేయలేదు. రింకూ సింగ్ తండ్రి మరణవార్త తెలుసుకున్న అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola