వర్షం కాదు.. ఓవర్ కాన్ఫిడెన్సే ముంచింది

Continues below advertisement

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా పరమ దారుణంగా ఓడింది. అయితే ఈ ఓటమికి 'డక్‌వర్త్ లూయిస్' సిస్టమ్‌ని ఎక్కువమంది బ్లేమ్ చేస్తుంటే.. కొంతమంది మాత్రం.. ఇండియా ఓడిపోవడానికి డక్‌వర్త్ లూయిస్ పద్ధతి కంటే.. బ్యాటర్ల ఓవర్ కాన్ఫిడెన్సే కారణమని అంటున్నారు. ఇండియా, ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో భారత్ 26 ఓవర్లలో 136 రన్స్ మాత్రమే చేసి.. 7 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. ఇక వర్షం పడటంతో డీఎల్ఎస్ పద్ధతి ప్రకారం.. స్కోర్‌ని రివైజ్ చేసి 131గా తేల్చడంతో.. ఆస్ట్రేలియాకి ఛేజింగ్ ఇంకా ఈజీ అయిపోయింది.

సాధారణంగా డీఎల్ఎస్ పద్ధతిలో స్కోర్ లెక్కిస్తే.. ఛేజింగ్‌ టీమ్‌కి ఇచ్చే టార్గెట్ స్కోర్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్ చేసిన స్కోర్ కంటే ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ మ్యాచ్‌లో అది తక్కువగా ఉండటంతో.. ఈ సిస్టం వల్లే ఇండియా ఓడిపోయిందని ఫ్యాన్స్ కోప్పడుతున్నారు. అయితే అసలు కారణం ఏంటంటే.. డీఎల్‌ఎస్ కౌంట్ చేసేటప్పుడు టీమ్ చేతిలో ఉన్న వికెట్లని కూడా కన్‌సిడర్ చేసి దాని ప్రకారం టార్గెట్ సెట్ చేస్తారు. అయితే భారత్ అప్పటికే 9 వికెట్లు పోగొట్టుకోవడంతో మిగిలిన ఒక్క వికెట్‌ని మాత్రమే కౌంట్‌లోకి తీసుకుని టార్గెట్ సెట్ చేశారు. అందుకే స్కోర్ ఎక్కువకి బదులు తగ్గిపోయింది. అంటే మన టీమ్ వికెట్లు పోగొట్టుకోవడం వల్లే ఓడిందన్నమాట.

అయితే ఇలా వికెట్లు పారేసుకోవడానికి కూడా మన ప్లేయర్ల ఓవర్ కాన్ఫిడెన్సే కారణమని, పేసర్లకి సపోర్ట్ చేసే పెర్త్ పిచ్ మీద జాగ్రత్తగా ఆడా్సింది పోయి.. సీనియర్ బ్యాటర్లు రోహిత్, కోహ్లీ ఇద్దరూ అవుట్ సైడ్ వెళ్లిపోయే బాల్స్‌ని అనవసర షాట్ ఆడబోయి అవుట్ కాగా.. గిల్, అయ్యర్ బంతిని ఏ మాత్రం జడ్జ్ చేయలేక అవుటయ్యారు. ఇక రాహుల్, అక్షర్ చెత్త షాట్లు ఆడి అవుటయ్యారు. ఒకవేళ టీమిండియా ఆటగాళ్లు ఇలా ఓవర్ కాన్ఫిడెన్స్‌కి పోకుండా ఉంటే.. మనమే గెలిచేవాళ్లమని తెగ బాధపడిపోతున్నారు ఫ్యాన్స్.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola