RCB vs GT Match Preview IPL 2026 Final | ఈసారి ఐపీఎల్ కప్ ఎవరిది?

Continues below advertisement

ఐపీఎల్ 2026 సీజన్ క్లైమాక్స్‌కు వచ్చేసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్‌తో టైటిల్ పోరుకు సిద్ధమైంది. క్వాలిఫైయర్ 1లో గుజరాత్‌ను ఘోరంగా ఓడించి RCB ఫైనల్‌కు దూసుకెళ్లగా, GT మళ్లీ క్వాలిఫైయర్ 2 గెలిచి పగ తీర్చుకోవడానికి వచ్చింది. మరి ఈ మహా సంగ్రామంలో గెలిచేది ఎవరు? 

ముందుగా RCB గురించి మాట్లాడుకుంటే.. రజత్ పటిదార్ భీభత్సమైన ఫామ్‌లో ఉన్నాడు, క్వాలిఫైయర్ 1లో 93 రన్స్‌తో విధ్వంసం సృష్టించాడు. విరాట్ కోహ్లీ, వెంకటేష్ అయ్యర్‌లతో RCB బ్యాటింగ్ లైన్ అప్ బాగుంది. ఇక గుజరాత్ టైటాన్స్ విషయానికి వస్తే, కెప్టెన్ షుబ్‌మన్ గిల్ మరియు రాహుల్ తెవాటియా ఒంటిచేత్తో మ్యాచ్‌లు గెలిపించగలరు.

ఈ మ్యాచ్‌లో మెయిన్ ఫైట్.. RCB పవర్‌ఫుల్ బ్యాటర్స్ వర్సెస్ GT స్పిన్ కింగ్ రషీద్ ఖాన్ మధ్య ఉండబోతోంది. మిడిల్ ఓవర్లలో రషీద్‌ను RCB ఎలా ఎదుర్కొంటుందనే దానిపైనే మ్యాచ్ మలుపు తిరుగుతుంది. అహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ భారీ స్కోర్లు నమోదు కావడం ఖాయం. టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్‌లతో RCB బౌలింగ్ బలంగా ఉంటే, కాగిసో రబాడాతో GT పేస్ అటాక్ కూడా గట్టి పోటీ ఇవ్వనుంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola