RCB vs GT Highlights IPL 2026 | ఆర్‌సీబీ జోరుకు బ్రేక్ వేసిన గుజరాత్

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జోరుకు బ్రేక్ పడింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ముందు జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ చేతిలో ఎదురైన ఓటమికి గుజరాత్ ఈ గెలుపుతో ప్రతీకారం తీర్చుకుంది.

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీకి ఆరంభంలో కోహ్లీ, పడిక్కల్  మంచి స్టార్ట్ ఇచ్చినా కూడా మిడిల్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది. దేవదత్ పడిక్కల్ 40 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో ఆర్‌సీబీ 19.2 ఓవర్లలో కేవలం 155 పరుగులకే పరిమితమైంది.

ఈ మ్యాచ్‌లో రజత్ పాటిదార్ అవుట్ అయిన తీరు పెద్ద చర్చకు దారితీసింది. హోల్డర్ పట్టుకున్న క్యాచ్‌లో బాల్ డైరెక్ట్ గా గ్రౌండ్ కి తగిలినట్లు అనిపించినా, థర్డ్ అంపైర్ దానిని అవుట్‌గా ప్రకటించారు. దాంతో ఆర్‌సీబీ భారీ స్కోర్ చేసే అవకాశం కోల్పోయింది. 156 రన్స్ టార్గెట్ ను గుజరాత్ టైటాన్స్ 15.5 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, జోస్ బట్లర్, రాహుల్ తెవాటియా రాణించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola