RCB vs GT Final Rain Rules | IPL 2026 ఫైనల్‌కు వర్షం ముప్పు?

ఐపీఎల్ ఫైనల్ మహా సంగ్రామానికి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. నేడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ తలపడాల్సి ఉంది. కానీ, ఇంతలోనే క్రికెట్ ఫ్యాన్స్‌కు ఒక బ్యాడ్ న్యూస్. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. అహ్మదాబాద్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే కప్ ఎవరిది? అన్న ప్రశ్న ఫ్యాన్స్ లో మొదలయింది. ఒకవేళ వర్షం పడితే మ్యాచ్ పూర్తి చేయడానికి అదనపు సమయం ఇస్తారు. ఓవర్లను కుదించి అయినా కనీసం చెరో 5 ఓవర్ల మ్యాచ్‌నైనా నిర్వహించడానికి అంపైర్లు ట్రై చేస్తారు. మ్యాచ్ సగం జరిగాక వర్షం వస్తే 'డక్‌వర్త్ లూయిస్' పద్ధతిని వాడతారు. ఒకవేళ ఐదు ఓవర్ల మ్యాచ్ కూడా సాధ్యం కాకపోతే, వాతావరణం సహకరిస్తే కేవలం 'సూపర్ ఓవర్' ద్వారా విజేతను డిసైడ్ చేస్తారు.

కానీ, ఒకవేళ పరిస్థితి మరీ ఘోరంగా ఉండి.. కనీసం ఒక్క సూపర్ ఓవర్ వేయడం కూడా సాధ్యం కాకపోతే ఏం జరుగుతుంది? ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఐపీఎల్ నిబంధనల సెక్షన్ 16.11.2 ప్రకారం.. లీగ్ స్టేజ్ పాయింట్స్ టేబుల్ ఆధారంగా విజేతను ప్రకటిస్తారు. అంటే లీగ్ స్టేజ్‌లో ఏ జట్టు అయితే మెరుగైన ర్యాంకింగ్‌లో ఉంటుందో ఆ జట్టునే ఛాంపియన్‌గా డిక్లేర్ చేస్తారు. ఆలా చూసుకుంటే గుజరాత్ కంటే ఆర్సీబీ పాయింట్స్ టేబుల్ లో మంచి ప్లేస్ లో ఉంది. కాబట్టి మ్యాచ్ పూర్తిగా రద్దయితే.. ఆర్సీబీ నేరుగా ఐపీఎల్ 2026 ఛాంపియన్‌గా అవతరిస్తుంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola