RCB vs Delhi Capitals WPL 2026 Final | ఫైనల్ కు చేరిన ఢిల్లీ

Continues below advertisement

మహిళా ప్రీమియర్ లీగ్ 2026 ( Women's Premier League 2026 ) సీజన్ ఫైనల్ కు చేరుకుంది. ఎలిమినేటర్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ( Delhi Capitals ), గుజరాత్ జెయింట్స్‌ను ( Gujarat Giants ) ఓడించి ఫైనల్ బర్త్ ను కన్ఫర్మ్ చేసుకుంది. అయితే వరుసగా నాలుగోసారి ఫైనల్‌కు చేరిన ఢిల్లీ, ఈసారి ఎలాగైనా టైటిల్ సాధించాలనే పట్టుదలతో ఉంది. ఫైనల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ( Royal Challengers Bangalor )  ఢిల్లీ తలపడనుంది. 

మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. కెప్టెన్ బెత్ మూనీ ( Beth Mooney ) 51 బంతుల్లో 62 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. 59 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన తన టీమ్ ను కెప్టెన్ బెత్ మూనీ ఆదుకుంది అనే చెప్పాలి. 

169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ మంచి స్టార్ట్ ను అందుకుంది. ఓపెనర్లు లిజెల్ లీ ( Lizelle Lee ), షఫాలీ వర్మ ( Shafali Verma ) పవర్‌ప్లేలో వికెట్ కోల్పోకుండా 72 పరుగులు చేసింది. లిజెల్ లీ, షఫాలీ వర్మ కేవలం 7 ఓవర్లలోనే 89 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి విజయం సాధించారు. ఇక ఫైనల్ మ్యాచ్ లో స్మ్రితి మందాన ( Smriti Mandhana ) సేనతో తలపడబోతుంది జమిమా టీమ్.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola