RCB vs DC IPL 2026 Highlights | ఢిల్లీని వణికించిన ఆర్‌సీబీ బౌలర్లు

ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విశ్వరూపాన్ని ప్రదర్శించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో ఢిల్లీ బ్యాటింగ్ డీలా పడింది. 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి రన్‌రేట్‌ను పెంచుకుంది RCB. 

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు మొదటి నుంచే చుక్కలు చూపించారు. పవర్ ప్లేలోనే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ఢిల్లీ. భువనేశ్వర్ కుమార్ స్వింగ్, జోష్ హేజిల్‌వుడ్ బౌలింగ్ కి ఢిల్లీ స్టార్ బ్యాటర్లు కేఎల్ రాహుల్, నితీష్ రాణా, అక్షర్ పటేల్ చేతులెత్తేశారు. అభిషేక్ పోరెల్ 30 పరుగులతో పర్వాలేదనిపించినా, మిగిలిన వారంతా విఫలం కావడంతో ఢిల్లీ కేవలం 75 పరుగులకే కుప్పకూలింది.

ఆర్‌సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లు పడగొట్టగా, హేజిల్‌వుడ్ 4 వికెట్లతో చెలరేగిపోయాడు. కృనాల్ పాండ్యా, సుయాష్, రసిక్ తలో వికెట్ తీశారు. కేవలం 76 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ, కేవలం 6.3 ఓవర్లలోనే చేజ్ చేసింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola