Ravindra Jadeja for 2027 World Cup | జడేజా స్థానంపై స్పష్టతనిచ్చిన కోచ్ బహుతులే

Continues below advertisement

భారత సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వన్డే భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలకు తెరపడింది. 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో జడేజా స్థానంపై ఎలాంటి డౌట్ లేదని, అతడి అనుభవం టీమ్ కు కొండంత బలంగా నిలుస్తుందని భారత స్పిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే స్పష్టం చేశారు. ఇటీవల వెస్టిండీస్‌‌తో జరిగిన తొలి వన్డేతో తిరిగి జట్టులోకి వచ్చిన జడేజాపై మేనేజ్‌మెంట్ పూర్తి నమ్మకంతో ఉందన్నారు.

గౌహతిలో జరగనున్న రెండో వన్డేకు ముందు మీడియాతో మాట్లాడిన బహుతులే.. దక్షిణాఫ్రికా పరిస్థితులకు తగిన బలమైన జట్టును సిద్ధం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. జడేజా బంతితోనే కాకుండా బ్యాట్‌తోనూ మ్యాచ్‌ను మలుపు తిప్పగలడని, గత ఆరు నెలల్లో బౌలర్‌గా మరింత మెరుగయ్యాడని కొనియాడారు.

మరోవైపు విండీస్‌తో తొలి వన్డేలో అద్భుతమైన స్పెల్‌తో మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పిన లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను ఆయన ప్రశంసించారు. హార్దిక్ పాండ్యా గాయం కారణంగా నితీష్ కుమార్ రెడ్డి వంటి యువ ఆటగాళ్లకు కొత్త బంతితో అవకాశాలు ఇస్తూ, జట్టు కూర్పుపై ప్రయోగాలు చేస్తున్నామని బహుతులే వివరించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola