రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఐపీఎల్ 2026కు సంబంధించి ఎన్నో ఆసక్తికర అంశాలు చోటు చేసుకున్నాయి. ఎవరు ఊహించని విధంగా సంజు శాంసన్, రవీంద్ర జడేజా టీమ్స్ మారారు. అయితే సంజు శాంసన్ తర్వాత రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ పై ఎన్నో పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ విషయంపై అభిమానుల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్ వంటి యంగ్ ప్లేయర్స్ కు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని కూడా ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు మరో పేరు తెరపైకి వచ్చింది. అతనెవరో కాదు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.
ట్రేడ్ డీల్ తో రాజస్థాన్ రాయల్స్ లోకి వచ్చిన జడేజాకు కెప్టెన్ భాద్యతలు ఇచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. దీనికి రతోడుగా రాజస్థాన్ రాయల్స్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. జడేజా ఫొటోను షేర్ చేస్తూ ‘దళపతి’ అనే టైటిల్ ను పెట్టారు. దాంతో 2026 ఐపీఎల్ లో జడేజాని RR కెప్టెన్ అంటూ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ RR మాత్రం ఇంకా ఎలాంటి కంఫోర్మషన్ ఇవ్వలేదు. 2008-2009 ఐపీఎల్ సీజన్లలో రాజస్థాన్‌కు ఆడిన జడేజా ఇప్పుడు మళ్లీ అదే జట్టులో కీలక పాత్ర పోషించనున్నారు.