Ravi Shastri Backs Mohammed Shami | షమీకి తప్పని నిరాశ.. సెలెక్టర్ల తీరును తప్పుబట్టిన రవిశాస్త్రి

Continues below advertisement

న్యూజిలాండ్ పర్యటన కోసం ప్రకటించిన వన్డే, టెస్ట్ జట్లలో స్టార్ పేసర్ మహమ్మద్ షమీకి చోటు దక్కకపోవడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చేందుకు షమీ తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ, సెలెక్టర్లు మాత్రం అతడిని వరుసగా పక్కన పెడుతూనే ఉన్నారు. 2025 మార్చిలో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత షమీ ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేదు. గాయం నుంచి పూర్తిగా కోలుకుని, దేశవాళీ క్రికెట్ తో పాటు ఐపీఎల్ 2026లోనూ నిలకడగా రాణించినా సెలెక్టర్ల నుంచి పిలుపు రాలేదు.

మరోవైపు, ఇదే పర్యటనకు ఎంపిక చేసిన టీ20 జట్టులో భువనేశ్వర్ కుమార్‌కు చోటు కల్పించారు. అనుభవానికి మేనేజ్‌మెంట్ ప్రాధాన్యత ఇస్తుందనే సంకేతాలు కనిపించడంతో, షమీకి కూడా వన్డే, టెస్ట్ జట్లలో తప్పక స్థానం లభిస్తుందని అందరూ భావించారు. కానీ షమీకి మళ్లీ నిరాశే మిగిలింది.

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి సెలెక్టర్ల తీరును తప్పుబట్టారు. "అనుభవానికి సాటిచ్చేది ఏదీ ఉండదు. రెడ్ బాల్, వైట్ బాల్ రెండింటిలోనూ అపారమైన అనుభవం ఉన్న మహమ్మద్ షమీ కూడా టెస్ట్, వన్డే జట్లలోకి తిరిగి రావడానికి పూర్తిగా అర్హుడు" అని రవిశాస్త్రి స్పష్టం చేశారు. యువ పేసర్లకు మేనేజ్‌మెంట్ ఎక్కువ ప్రిఫరెన్స్  ఇస్తుండడంతో ఫిట్‌గా ఉన్న సీనియర్ పేసర్ షమీ జట్టులోకి ఎప్పుడు వస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola