Rajasthan Royals to be Sold IPL 2026 | అమ్మకాన్ని రాజస్థాన్ రాయల్స్ టీమ్ ?

Continues below advertisement

ఐపీఎల్ 2026 సీజన్ కు సంబంధించి ఇప్పటి నుంచే చర్చ మొదలయింది. ప్లేయర్స్, ఫ్రాంఛైజీలకు సంబంధించి ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఇప్పటికే ఫ్యాన్స్ ఊహించని విధంగా ప్లేయర్స్ ను ట్రేడ్ చేసుకున్నాయి కొన్ని ఫ్రాంఛైజీలు. వాటితో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ను అమ్మేసేందుకు ఆ ఫ్రాంఛైజీ సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. ఈ టీమ్ ను ఎవరు కొనుగోలు చేస్తారా అని ఫ్యాన్స్ అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇలాంటి టైంలో మరో టీమ్ కూడా అమ్మకానికి రెడీ అవుతుందట. అదే రాజస్థాన్ రాయల్స్. ఫ్రాంఛైజీని అమ్మేయాలని రాజస్థాన్ రాయల్స్ మేనేజ్‌మెంట్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు రెండు టీమ్స్ అమ్మకానికి ఉండడంతో వీటిని దక్కించుకోవడానికి నలుగురు, ఐదుగురు పోటీ పడుతున్నారట.  

ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మంచి డిమాండ్ కొనసాగుతుంది. ఆర్సీబీని దక్కించుకోవడానికి ప్రముఖ కన్నడ ప్రొడక్షన్ హౌస్ హోంబేలె ఫిలిమ్స్ కూడా ట్రై చేస్తునట్టు వార్తలు వస్తున్నాయి. రాజస్థాన్ రాయల్స్ కు కూడా మంచి డిమాండ్ కొనసాగుతుంది. మరి ఈ రెండు టీమ్స్ ని ఎవరు దక్కించుకుంటారో చూడాలి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola