భారత్, సౌతాఫ్రికా మ్యాచ్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే విన్నర్ ఎవరు?
విమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2025 ఫైనల్ మ్యాచ్ ఆదివారం నవీ ముంబై వేదికగా జరగబోతోంది. టీమిండియా, సౌతాఫ్రికా రెండు జట్లూ ఎలాగైనా ట్రోపీ గెలుచుకుని ఫస్ట్ టైం వరల్డ్ చాంపియన్‌గా నిలవాలని పట్టుదలగా ఉన్నాయి. కానీ ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారనేది పక్కన పెడితే.. అసలు మ్యాచ్ జరగడమే డౌట్‌గా కనిపిస్తోంది. దీంతో అనుకోకుండా మ్యాచ్ రద్దయితే ఎవరు విజేత అవుతారనే డౌట్ ఫ్యాన్స్‌లో మొదలైంది.
అసలు విషయం ఏంటంటే.. మ్యాచ్ జరిగే నవీ ముంబైలో వరల్డ్ కప్ మొదలైనప్పటి నుంచి భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఈ వర్షాల వల్లే చాలా మ్యాచ్‌లు రద్దయ్యాయి కూడా. ఈ సారి ఇండియా, సఫారీల మధ్య జరగబోయే ఫైనల్ మ్యాచ్ సమయంలో కూడా వర్షం పడే ఛాన్స్ ఉందట. ఆదివారం నాడు నవీముంబైలో వర్షం పడే ఛాన్స్ 60 శాతం ఉందని వెదర్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. అంటే మ్యాచ్ జరిగడానికి 60-40 ఛాన్స్ మాత్రమే ఉందన్నమాట.
అయితే ఏం..? ఫైనల్ మ్యాచ్ కాబట్టి రిజర్వ్ డే ఉంటుంది కదా? సోమవారం ఆడతారు. అనుకోవచ్చు. నిజమే.. ఒకవేళ ఆదివారం 20 ఓవర్ల మ్యాచ్ సాధ్యం కాకపోతే.. రిజర్వ్ డే అయిన సోమవారం ఎక్కడైతే మ్యాచ్ ఆగిపోయిందో అక్కడి నుంచే మళ్లీ స్టార్ట్ చేస్తారు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే.. రిజర్వ్ డే అయిన సోమవారం కూడా నవీ ముంబైలో వర్షం పడే ఛాన్స్‌లు ఎక్కువగానే ఉన్నాయి. కానీ మ్యాచ్ రద్దయ్యే స్థాయిలో వర్షం పడకపోవచ్చు. అయితే ఏం జరుగుతుందో చెప్పలేం.
ఒకవేళ సోమవారం కూడా భారీ వర్షంతో మ్యాచ్ రద్దయితే.. ఐసీసీ రూల్స్ ప్రకారం రెండో రోజు కనీసం రెండు జట్లు 20 ఓవర్ల మ్యాచ్ అయినా ఆడేలా చూస్తారు. దాంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో విజేతను ప్రకటిస్తారు. అది కూడా సాధ్యం కాకపోతే.. మ్యాచ్‌ను కంప్లీట్‌గా రద్దు చేసి ట్రోఫీని రెండు జట్లకు సమానంగా ఇస్తారు. అంటే.. రెండు జట్లనీ విజేతగా ప్రకటిస్తారన్నమాట.