PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?

Continues below advertisement

భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఒకప్పుడు కోర్టులోకి దిగితే పతకం పక్కా అనుకునే స్థాయి నుంచి, ఇప్పుడు ఫైనల్ చేరినా ఒత్తిడి తట్టుకోలేక బోల్తా పడే పరిస్థితికి ఎందుకు వచ్చింది? పారిస్ వేదికగా జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ పోరు సింధు ప్రస్తుత ఫామ్‌పై మరోసారి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది.  
ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌ను 21-16తో గెలుచుకుని శుభారంభం చేసిన సింధు, ఆ తర్వాత ఊహించని రీతిలో చేతులెత్తేసింది. రెండో గేమ్‌లో కేవలం 11 పాయింట్లకే కుప్పకూలడం, నిర్ణయాత్మక మూడో గేమ్‌లో 8-8తో సమానంగా ఉన్న దశ నుంచి ఏకపక్షంగా వరుస తప్పిదాలు చేయడం చూస్తుంటే... సింధు తన మునుపటి ఫినిషింగ్ టచ్‌ను పూర్తిగా కోల్పోయినట్టే కనిపిస్తోంది. చూస్తుండగానే 12-21తో ఆ గేమ్‌తో పాటు టైటిల్‌ను కూడా ప్రత్యర్థికి అప్పగించేసింది.  
గత వారం కూడా ఇదే ఆన్ సె యంగ్ చేతిలో ఓడిపోయిన సింధు, వరుసగా రెండో వారం కూడా అదే తప్పులను పునరావృతం చేస్తూ ఓటమి పాలైంది. కీలకమైన సమయాల్లో ఆధిక్యాన్ని కాపాడుకోలేకపోవడం, నెట్ దగ్గర అనవసర తప్పిదాలు చేయడం ఈ మధ్య కాలంలో సింధుకు నిత్యకృత్యంగా మారిపోయింది. ముఖ్యంగా ప్రపంచ నంబర్ వన్ ఆన్ సె యంగ్‌తో ఆడిన ప్రతిసారీ ఇదే తరహా వైఫల్యం ఎదురవుతోంది. కష్టపడి ఫైనల్ వరకు వస్తున్నా, ఆఖరి మెట్టుపై ఒత్తిడిని జయించలేక రన్నరప్ ట్రోఫీలతోనే సరిపెట్టుకుంటోంది.  
మునుపటిలా మ్యాచ్‌ను ముగించే దూకుడు కనిపించకపోవడం, ఒత్తిడి సమయాల్లో అదుపు తప్పడం ఆమె కెరీర్‌ను ప్రశ్నార్థకం చేస్తోంది. ఒకప్పటి గోల్డెన్ గర్ల్ సింధు మళ్లీ తన ఛాంపియన్ ఆటతీరును అందుకోగలదా, లేక ఈ వైఫల్యాల పరంపర ఇలాగే కొనసాగుతుందా? అనేది వేచి చూడాలి !!

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola