PV Sindhu Lost World Championship | పేలవ ఫామ్ ను కొనసాగిస్తూ ఓడిన సింధు | ABP Desam

 ఒకప్పుడు సింధు పేరు చెబితే బ్యాడ్మింటన్ లో మెడల్స్..రికార్డ్స్. ఆమెకు సాగిలపడని బ్యాడ్మింటన్ టోర్నీ లేదు. ఆమె ప్రతిభకు వేదిక కానీ సూపర్ సిరీస్..వరల్డ్ లెవెల్ టోర్నీ లేదు. అలాంటి సింధు కెరీర్ ఆల్మోస్ట్ ఎండింగ్ కు వచ్చేసిందా. ఈ 30ఏళ్ల తెలుగమ్మాయి వరుస వైఫల్యాలు దేనికి సూచిక అనేదే ఇప్పుడు ప్రశ్న. వరల్డ్ ఛాంపియన్ షిప్ లో సింధు పోరాటం ముగిసింది. వరల్డ్ నెంబర్ 2 ర్యాంకర్ పై మొత్తానికి ట్రాక్ లో వచ్చింది సింధు అనిపించినా క్వార్టర్స్ లో కుసుమవర్థనిపై ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది సింధు. 2019లో బంగారు పతకం సాధించిన చోట ఇప్పుడు కనీసం కాంస్య పతక పోటీకి అర్హత సాధించలేకపోయింది. ఇదొక్కటే కాదు ఈ ఏడాది ఆడిన ఐదు సూపర్ సిరీస్ టోర్నీల్లో సింధు మొదటి రౌండ్ కూడా దాటలేకపోయింది.  ఆల్ ఇంగ్లండ్ ఓపెన్, స్విస్ ఓపెన్, ఇండోనేషియా మాస్టర్స్, మలేసియా మాస్టర్స్, జపాన్ ఓపెన్ లో మొదటి రౌండ్ లోనే ఓటమి చెందిన సింధు...
చైనా, ఇండోనేషియా, సింగపూర్ ఓపెన్ లలో రెండో రౌండ్ లో ఇంటి దారి పట్టింది. రెండు సార్లు ఒలింపిక్ పతకాలు సాధించి దేశం తరపున బ్యాడ్మింటన్ లో మరే క్రీడాకారిణి సాధించనన్ని ఘనతలు సాధించిన సింధు..ఇటీవలి ఫామ్ చూస్తుంటే ఆమె కెరీర్ ఎండింగ్ కు వచ్చిందనే సంకేతాలు కనిపిస్తున్నాయంటున్నారు క్రీడా విశ్లేషకులు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola