Pratika Rawal | India vs Australia | గాయపడ్డ టీమ్ ఇండియా ఓపెనర్ ప్రతీక రావెల్
ఉమెన్స్ ప్రపంచకప్ టోర్నమెంట్ లో టీమ్ ఇండియా సెమీఫైనల్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. ఎలాగైనా ఈ సారి టైటిల్ సొంతం చేసుకోవాలని భారత్ ఎదురు చూస్తుంది. అయితే సెమీఫైనల్ మ్యాచ్ ఆస్ట్రేలియాతో జరగనుంది. లీగ్ స్టేజ్ లోనే ఇండియాను ఆసీస్ చిత్తుగా ఓడించింది. కానీ సెమిస్ లో మాత్రం ఎలాంటి తప్పులు చేయకుండా గెలవాలని భావిస్తున్నారు అమ్మాయిలు. కానీ ఇలాంటి టైం లో టీమ్ ఇండియాకు పెద్ద షాక్ తగిలింది.
ఇండియా బాంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యంగా మొదలయింది. బంగ్లాదేశ్ మొదట బ్యాటింగ్ చేస్తోంది. అదే ఇన్నింగ్స్ 21వ ఓవర్ లో ప్రతీక రావెల్ గాయపడింది. దీప్తి శర్మ బౌలింగ్‌లో బంగ్లాదేశ్ బ్యాటర్ షర్మిన్ అఖ్తర్ డీప్ మిడ్‌వికెట్, లాంగ్ ఆన్ వైపు షాట్ కొట్టింది. డీప్ మిడ్‌వికెట్ బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ప్రతీక బంతిని ఆపడానికి తన ఎడమ వైపుకు పరిగెత్తింది. ఈ క్రమంలో ప్రతీక కాలికి గాయమైంది. నొప్పితో మైదానంలోనే పడిపోయింది. కొద్దిసేపటికి మైదానం వీడింది. ఆ తర్వాత ప్రతీక ఫీల్డింగ్‌కు రాలేదు. బ్యాటింగ్ కూడా చేయలేదు.
ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ లో ప్రతీక ఆడుతుందా లేదా అన్నది పెద్ద డౌట్ గా మారింది. ఇలాంటి కీలక సమయంలో ప్రతీక స్థానంలో మరో ఓపెనర్ ను సెలెక్ట్ చేయడం అంటే చాలా కష్టం.