International కి పిలుపొచ్చింది. కానీ సహాయం కోసం ఎదురుచూస్తున్న పవర్ లిఫ్టర్ రమేష్.
రమేష్ జీవితంలో ఓ కల ఇంటర్నేషనల్ లెవల్లో భారతదేశానికి ఒక పతకం తీసుకురావాలని. ఇప్పుడు టర్కీలో జరిగే పోటీల్లో ఆ అవకాశం వచ్చింది. కానీ టర్కీ వెళ్లడానికి డబ్బులు లేవు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన రమేష్ అతి కష్టం మీద ఇక్కడదాకా వచ్చాడు. జూనియర్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన రమేష్ తనకు ఎవరైనా లిఫ్ట్ ఇస్తే ఇంటర్నేషనల్ లెవల్ లోనూ, అటు కామన్ వెల్త్ లో కూడా పతకం తీసుకొస్తానంటున్నాడు.