Pakistan Fielding Women's ODI World Cup | ట్రోల్ అవుతున్న పాకిస్తాన్ ప్లేయర్స్
వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా పాకిస్తాన్ ఉమెన్స్ టీమ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ లో అందరు ఊహించినట్టుగానే పాకిస్తాన్ ఇండియా చేతిలో ఓడిపోయింది. భారత్ 50 ఓవర్లలో 247 పరుగులు చేసి ఆలౌట్ అయింది. కానీ పాకిస్తాన్ మాత్రం కేవలం 43 ఓవర్లలో 159 పరుగులు చేసి భారత్ కు భారీ విజయాన్ని అందించింది. అయితే ఇప్పుడు ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ప్లేయర్స్ చేసిన ఫీల్డింగ్ మిస్టేక్స్ గురించి అందరు మాట్లాడుకుంటున్నారు.
టీమిండియా ఇన్నింగ్స్ లో ఆఖరి ఓవర్‌లో రిచా ఘోష్ స్ట్రయిక్‌లో ఉంది. కాంతి గౌడ్ నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉంది. పాకిస్తాన్ బౌలర్ డయానా బైగ్ వేసిన షార్ట్ బాల్ ను రిచా గాల్లోకి లేపింది. ఫీల్డర్ నవాజ్ దానికి పరిగెత్తుకుంటూ వచ్చి క్యాచ్ పట్టడానికి ట్రై చేసింది. అదే టైంలో పర్వైజ్ కూడా వెనుక నుంచి రావడంతో ఇద్దరు ఢీకొని, క్యాచ్‌ను వదిలేశారు. ఈ ఫీల్డింగ్ మిస్టేక్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఇలాంటి క్యాచ్ వదిలేస్తే ఎలా అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. పాకిస్తాన్ మెన్ అండ్ విమెన్ టీమ్ కు తేడా లేదంటూ ట్రోల్ చేస్తున్నారు.