పాక్ ఓవర్ యాక్షన్.. యూఏఈతో మ్యాచ్‌కి గంట ఆలస్యంగా టీం
ఓవర్ యాక్షన్, బిల్డప్.. అతి షో.. ఇలాంటి పదాలకి ఎవర్నైనా ఎగ్జాంపుల్‌గా చూపించాలంటే సింపుల్‌గా పాకిస్తాన్ టీమ్‌ని చూపిస్తే సరిపోతుంది. బుధవారం యూఏఈతో మ్యాచ్ సందర్భంగా పాక్ టీమ్ చేసిన రచ్చ చూసిన తర్వాత సోషల్ మీడియాలో పాకిస్తాన్‌పై ఇలాంటి కామెంట్సే వస్తున్నాయి. భారత్‌తో షేక్‌హ్యాండ్ ఇష్యూ తర్వాత.. ఇండియా,పాక్ మ్యాచ్‌కి రిఫరీగా ఉన్న ఆండీ పైక్రాఫ్ట్‌ని టోర్నీ నుంచి తప్పిస్తేనే మ్యాచ్ ఆడతామని భీష్మించుకు కూర్చుంది. లేదంటే టోర్నీ నుంచి తప్పుకుంటామని బెదిరించింది కూడా. కానీ ఐసీసీ మాత్రం సింపుల్‌గా నో చెప్పింది. దాంతో కనీసం యూఏఈతో తామాడబోయే మ్యాచ్ వరకైనా పైక్రాఫ్ట్‌ని తప్పించాలని డిమాండ్ చేసింది పాక్. దీనికి కూడా ఐసీసీ కుదరదని తెగేసి చెప్పింది. ఈ అవమానంతో పీసీబీ అలిగి.. యూఏఈతో మ్యాచ్ ఆడటానికి వెళ్లొద్దంటూ ఆటగాళ్లకు ఆదేశించింది. టోర్నీ నుంచే తప్పుకుంటున్నామంటూ ఐసీసీకి మెసేజ్‌లు కూడా పంపించింది. దీంతో ఈ మ్యాచ్ జరగదేమో అని ఫ్యాన్స్ స్టేడియానికి వచ్చిన ఫ్యాన్స్ కూడా వెనక్కి తిరిగి వెళ్లిపోవడం స్టార్ట్ చేశారు. అయితే ఓ గంట తర్వాత ఏమైందో ఏమో పాక్ జట్టు మ్యాచ్ ఆడటానికి స్టేడియానికి వచ్చింది. యూఏఈతో మ్యాచ్ ఆడింది. దీనిపై పీసీబీ స్పోక్స్‌పర్సన్ అర్థరాత్రి టైంలో మీడియాకి ఓ మెసేజ్ పెట్టాడు. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ తమ టీమ్ మేనేజర్‌తో పాటు కెప్టెన్‌కు క్షమాపణలు చెప్పారంటూ ప్రకటన విడుదల చేశాడు. మరి పాక్ చేసిన ఈ ఆలస్యంపై మీ కామెంట్ ఏంటి?