Pakistan Conditions to Play with India | భారత్‌తో మ్యాచ్ ..షరతులు పెట్టిన పాక్

Continues below advertisement

టీ20 ప్రపంచకప్ 2026 ( T20 World Cup 2026 ) టోర్నమెంట్ చాలా ఉత్కంఠ భరితంగా కొనసాగుతుంది. అయినప్పటికీ క్రికెట్ ప్రపంచం మొత్తం భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తుంది. పాకిస్థాన్ ప్రభుత్వం తమ జట్టును టోర్నమెంట్‌లో ఆడనిస్తోంది కానీ, భారత్‌తో తలపడటానికి మాత్రం నో అంటోంది. ఈ క్రమంలో ఐసీసీతో చర్చలు జరుపుతున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( Pakistan Cricket Board ) భారత్ తో మ్యాచ్ ఆడేందుకు షరతులు పెట్టింది. 

ఐసీసీ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో పీసీబీ కొన్ని డిమాండ్లు చేసింది. అవి ఏంటంటే టోర్నమెంట్ నుంచి తప్పుకున్నందుకు బంగ్లాదేశ్‌కు ఇచ్చే నష్టపరిహారాన్ని భారీగా పెంచాలి. మ్యాచ్ ఆడకపోయినా బంగ్లాదేశ్‌కు ( Bangladesh ) పూర్తి ఫీజు చెల్లించాలి. వచ్చే ఐసీసీ ఈవెంట్ల నిర్వహణ బాధ్యతను బంగ్లాదేశ్‌కు అప్పగించాలి. అలాగే భారత ప్లేయర్లు పాకిస్తాన్ ప్లేయర్స్ కు షేక్ హ్యాండ్ ఇవ్వాలి. భారత ప్లేయర్లు షేక్ హ్యాండ్ ఇస్తామని కన్ఫర్మ్ చేస్తేనే మ్యాచ్ ఆడతామని, లేదంటే బాయికాట్ చేస్తామని అంటుందట పీసీబీ. 

భారత్‌లో ఆడేందుకు భద్రతా కారణాలు చూపిస్తూ బంగ్లాదేశ్ తప్పుకుంది. బంగ్లాను సపోర్ట్ చేయడానికి పాక్, భారత్ తో మ్యాచ్ ఆడమని అంటుంది. పీసీబీ పెట్టిన షరతులు బంగ్లాదేశ్ ప్రయోజనాల కోసం ఉండటం గమనార్హం. ఇప్పటికే బాంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌ ( Scotland ) ఈ టోర్నీలో ఆడుతుంది. పీసీబీ డిమాండ్స్ పై ఐసీసీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola