NYPD Take Down Rohit Fan | Ind vs Ban ప్రాక్టీస్ మ్యాచ్ లో ఒళ్లు గగుర్పొడిచే ఘటన
ఈ వీడియో చూశారా. నిన్న న్యూయార్క్ లో బంగ్లాదేశ్ వర్సెస్ టీమిండియా ప్రాక్టీస్ టీ20 మ్యాచ్ లో జరిగింది. ఇండియా ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మ దగ్గరకు ఓ అభిమాని దూసుకుని వచ్చాడు. సెక్యూరిటీని బ్రీచ్ చేస్తూ గ్రౌండ్ లోకి వచ్చి రోహిత్ శర్మను హగ్ చేసుకున్నాడు. హిట్ మ్యాన్ కూడా చాలా క్యాజువల్ గా తీసుకుని ఓకే వెళ్లిపో అన్నట్లు ఏదో చెబుతున్నాడు. అంతే ఈ లోగా NYPD వచ్చేసింది. న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ చెందిన ఆఫీసర్స్ వచ్చి ఆ రోహిత్ అభిమానిని టేక్ డౌన్ చేశారు. ఉన్నపళంగా అమాంతం గాల్లోకి ఎత్తి నేలకేసి కొట్టేస్తారు. చేతులు రెండూ వెనక్కి విరిచి కఫ్స్ వేసేస్తారు. ఇది NYPD జనరల్ గా క్రిమినల్స్ మీద ఫాలో అయ్యే బ్రూటల్ అండ్ అగ్రెసివ్ వే ఆఫ్ అప్రోచ్. ఆటగాళ్లు అనే కాదు భద్రతకు సంబంధించిన ఏ ఇష్యూనైనా వాళ్లు ఇంతే సీరియస్ గా తీసుకుంటారు. మనోళ్లకుండే క్రికెట్ పిచ్చ గురించి తెలిసిందేగా. ప్రత్యేకించి ధోని, విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ లకు ఉండే ఫ్యాన్ బేసే వేరు. వాళ్లను లైఫ్ లో ఒక్కసారైనా కలవాలని..కుదిరితే హగ్ చేసుకోవాలని..వాళ్లు క్రికెట్ చేసిన సేవలకు గుర్తుగా కాళ్లు మొక్కాలని ట్రై చేస్తుంటారు. అలాగే పాపం ఈ ఫ్యాన్ ఎవరో ఏదో వాంఖడేలోనో, చెపాక్ లోనో చేసినట్లు న్యూయార్క్ లో ట్రై చేశారు. అంతే న్యూయార్క్ పోలీసులు ఆ ఫ్యాన్ మీద విరుచుకుపడుతుంటే పాపం రోహిత్ శర్మకు బాధ వేసింది. మాకు ఇది కామన్ అన్నట్లు ఏదో చెప్పబోయాడు కానీ పోలీసులు వినిపించుకోలేదు. ఏం చేయలేని స్థితిలో డ్రెస్సింగ్ రూమ్ నుంచి సపోర్టింగ్ స్టాఫ్ ను పిలిచాడు. వాళ్లు పోలీసులతో మాట్లాడి అంత హార్ష్ గా ప్రవర్తించనక్కర్లేదు క్రికెట్ అంటే ఉండే అభిమానం, ఆటగాళ్ల పై ప్రేమతోనే ఇలా చేస్తారని నచ్చచెప్పబోయారు. కానీ న్యూయార్క్ పోలీసులు వినిపించుకోలేదు. రోహిత్ శర్మ ఫ్యాన్స్ సెక్యూరిటీ బ్రీచ్ చేసినందుకు అరెస్ట్ చేశారు.