సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్

Continues below advertisement

నితీశ్ కుమార్ రెడ్డి. ఈ పేరు ఇప్పుడు దేశమంతా చాలా గట్టిగా మోగుతోంది. మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఫోర్త్ టెస్ట్ మ్యాచ్‌లో 8th పొజిషన్‌లో బరిలోకి దిగిన నితీశ్...సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. ఈ సిరీస్‌లో మొత్తం 8 సిక్స్‌లు కొట్టి...మరో రికార్డునీ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియాలో సింగిల్ సిరీస్‌లో 8 సిక్స్‌లు కొట్టిన తొలి ఇండియన్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. 171 బంతుల్లో సెంచరీ చేశాడు నితీశ్. అయితే...సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ ఫొటో తెగ వైరల్ అవుతోంది. సెంచరీ చేసిన వెంటనే నితీశ్ కుమార్...తన బ్యాట్‌ని కుడి చేతితో పట్టుకుని దానిపై హెల్మెట్ పెట్టి..పిచ్‌పై మోకాలిపై కూర్చున్నాడు. ఈ స్టిల్‌ని..బాహుబలి సినిమాలో ప్రభాస్ స్టిల్‌తో పోల్చుతున్నారు. బాహుబలిలో ప్రభాస్ కత్తి పట్టుకుని సేమ్ ఇదే స్టిల్‌లో కూర్చుని ఉంటాడు. ఈ రెండింటినీ కంపేర్ చేస్తూ తెగ పోస్ట్‌లు పెడుతున్నారు నెటిజన్లు. ఇక మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే...ఇదే మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేసినప్పుడు బ్యాట్‌తో గడ్డాన్ని దువ్వుకున్నాడు. ఇది పుష్ప సినిమాలో అల్లు అర్జున్ మేనరిజం. అక్కడ చేయితో బన్నీ గడ్డాన్ని సవరించుకుంటే..ఇక్కడ నితీశ్ బ్యాట్‌తో ఆ పని చేశాడు. అటు ప్రభాస్ ఫ్యాన్స్, ఇటు బన్నీ ఫ్యాన్స్‌ ఈ స్టిల్స్‌ని వైరల్ చేస్తున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram