Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్

రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ భారత అంధ మహిళల క్రికెట్ జట్టుకు భారీ నజరానా ప్రకటించారు. తొలిసారి జరిగిన అంధుల టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న టీమ్ కు తమ ఫౌండేషన్ తరఫున 5 కోట్లు అందజేశారు. 

ముంబైలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో నీతా అంబానీ స్వయంగా టీమ్ కు 5 కోట్ల చెక్కును అందించారు. అంధ మహిళల జట్టు కెప్టెన్ దీపికతో పాటు, టీ20 ప్రపంచకప్ 2024 గెలిచిన పురుషుల జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, వన్డే ప్రపంచకప్ 2025 విజేతగా నిలిచిన మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌లను ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా నీతా అంబానీ మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. "నూతన సంవత్సరాన్ని ఒక ప్రత్యేకమైన సందర్భంతో ప్రారంభిస్తున్నాం. మూడు భారత క్రికెట్ జట్లు ఒకే గూటి కిందకు రావడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి భారతీయుడి తరపున వారికి ధన్యవాదాలు తెలుపుతూ, వారి విజయాలను వేడుకగా జరుపుకుంటున్నాం" అని అన్నారు నీతా అంబానీ.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola