Nikhath Zareen Scripts History: ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం గెలుచుకున్న నిఖత్ జరీన్
తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించింది. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం గెలుచుకుంది. 52 కిలోల విభాగంలో జరిగిన తుదిపోరులో జిట్ పాంగ్ అనే థాయ్ లాండ్ బాక్సర్ ను మట్టికరిపించి భారత పతాకాన్ని రెపరెపలాడించింది. ఫైనల్ లో 5-0 తేడాతో సూపర్ విజయం సాధించింది. నిఖత్ జరీన్ విజయం సాధించడంపై ఆమె తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Tags :
Nikhat Zareen World Boxing Championship Nikhat Zareen Gold Nikhat Zareen Wins Gold Telangana Boxer