David Warner : వార్నర్ భీకర ఫామ్ చూసి హైదరాబాద్ ను ఉతికేసిన నెటిజెన్స్
T20 వరల్డ్ కప్ 2021, ఆస్ట్రేలియా ను వరించింది. సుదీర్ఘ కల నెరవేరింది. చిరకాల ప్రత్యర్థి న్యూజిలాండ్ ను టాస్ నుంచే డామినేట్ చేసి కంగారు పెట్టించింది. ఆసీస్ ఆట గురించి మాట్లాడాలంటే డెఫినెట్ గా వార్నర్ గురించి చెప్పుకోవాల్సిందే. ఆరు మ్యాచుల్లోనే 47 average , 159 స్ట్రైక్‌రేట్‌తో 236 పరుగులు చేశాడు. రెండు హాఫ్ సెంచరీస్ బాదేశాడు. అతడి తర్వాతి స్థానంలో ఉన్న ఆరోన్ ఫించ్ చేసింది 130 పరుగులే కావడం గమనార్హం.