2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ఐపీఎల్ మినీ వేలం ముగిసింది. ఫ్రాంచైజీలన్నీ దాదాపు వాళ్ల పర్స్ ఖాళీ చేసుకున్నాయి. ఇలాంటి టైంలో టాప్ జట్ల బలాబలాలు చూస్తే.. జస్ట్ 2.5 కోట్ల పర్స్‌తో వేలంలోకి ఎంట్రీ ఇచ్చిన ముంబై చాలా తెలివిగా బిడ్ చేసి కీలక ప్లేయర్‌ని కొనుక్కుంది. లాస్ట్ ఐపీఎల్ సీజన్లో రోహిత్‌తో ఓపెనింగ్ జోడీ విషయంలో ఇబ్బంది పడ్డ ముంబై.. వేలంలో కేవలం కోటి రూపాయల లోయెస్ట్ ప్రైజ్‌కి డీకాక్‌ను కొనుగోలు చేసింది. దీంతో ముంబై ఎదుర్కొంటున్న అతిపెద్ద ఓపెనింగ్ జోడీ ప్రాబ్లం తీరిపోయింది. ఇక ఈ పర్చేజ్‌తో ముంబై టీమ్ మరింత బలంగా మారింది. ఓపెనింగ్‌లో రోహిత్, డీకాక్ ఫిక్స్ అయిపోయారు. ఆ తర్వాత టాప్ ఆర్డర్‌లో తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, ఉండనే ఉన్నారు. నెక్ట్స్ మిడిలార్డర్‌లో హార్దిక్ పాండ్య, విల్ జాక్స్‌తో బ్యాటింగ్ లైనప్ అదిరిపోయింది. పేస్ బౌలింగ్‌లో బుమ్రా, బౌల్ట్ సూపర్ ఫామ్‌లో ఉంటే.. ఆల్‌రౌండర్లుగా శాంట్నర్, శార్దూర్ మంచి అసెట్ కాబోతున్నారు. ఇక స్పిన్ డిపార్ట్‌మెంట్‌లో మయాంక్ మార్కండే, రఘు శర్మ లాంటి యంగ్ స్పిన్నర్లతో బరిలోకి దిగబోతోంది ముంబై. ఈ టీమ్ చూస్తుంటే కచ్చితంగా ఈ సారి ఐపీఎల్ సీజన్లో మళ్లీ 2019లో ఉన్న స్ట్రాంగెస్ట్ టీమ్‌లా కనిపిస్తోందని, ఈ సారి కప్పు కొట్టడం పక్కా అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.